ఇలాంటి చాన్స్‌ అరుదుగా వస్తుంది: నభా నటేష్‌ | Nabha Natesh About Naga Bandham Movie | Sakshi
Sakshi News home page

ఇలాంటి చాన్స్‌ అరుదుగా వస్తుంది: నభా నటేష్‌

Jun 30 2026 4:42 AM | Updated on Jun 30 2026 4:42 AM

Nabha Natesh About Naga Bandham Movie

‘‘నాగబంధం, స్వయంభు’ వంటి పాన్‌ ఇండియా చిత్రాల్లో ఒకే సమయంలో నటించడం ఆనందంగా ఉంది. ఈ రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవి. ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూడదగ్గవే. ఇలాంటి బిగ్‌ మూవీస్‌లో నటించడం నాకు చాలా సంతృప్తిగా ఉంది’’ అని నభా నటేష్‌ చెప్పారు. 

విరాట్‌ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నాగబంధం–ది సీక్రెట్‌ ట్రెజర్‌’. కిషోర్‌ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ జూలై 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా నటేష్‌ మాట్లాడుతూ– ‘‘నాగబంధం’లో నేను పార్వతి అనే వేద విద్యార్థిని పాత్రలో కనిపిస్తాను.

కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా నిలబడే వ్యక్తిత్వం ఆమెది. పార్వతి తీసుకునే ప్రతి నిర్ణయం కథపై ప్రభావం చూపుతుంది. నా పాత్ర కోసం రెడీ అవడానికి దాదాపు రెండు గంటలు పట్టేది. ఇలాంటి సినిమాల్లో నటించే చాన్స్‌ చాలా అరుదుగా వస్తుంది. 

ఈ సినిమా కోసం వేసిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు మేం చాలా నియమ నిష్టలతో పని చేశాం. పూర్తిగా శాకాహారులుగా ఉన్నాం. ‘నమోరే..’ పాటను దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో గణేష్‌ ఆచార్య మాస్టర్‌ తెరకెక్కించారు. ఈ పాట స్క్రీన్‌పై చాలా బాగుంటుంది. అభిషేక్‌ నామాగారు ‘నాగబంధం’ని అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement