అమ్మాయి ఆత్మకథ | manyam movie pressmeet | Sakshi
Sakshi News home page

అమ్మాయి ఆత్మకథ

Aug 1 2018 2:40 AM | Updated on Aug 1 2018 2:40 AM

manyam movie pressmeet - Sakshi

రఘువీర్

అటవీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మన్యం’. ‘బాహుబలి’ ప్రభాకర్‌ ముఖ్య పాత్రలో నటించారు. రమణ ఎస్‌.వి (వెంకట్రావ్‌) దర్శకత్వంలో సాయి సంహిత క్రియేషన్స్‌ పతాకంపై శ్రీసత్య జయ కోమలీదేవి నిర్మించారు. రఘువీర్, వర్ష, శ్రావణ్, జీవా, గిరిధర్‌ తదితరులు నటించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పగ, ప్రతీకారాల మధ్య అడవిని, తన జాతిని కాపాడుకునే ఓ అమ్మాయి ఆత్మకథతో ఈ చిత్రం రూపొందించాం. ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదు. మా సినిమా పాటలను దర్శక–నిర్మాత వైవీఎస్‌ చౌదరిగారు రిలీజ్‌ చేసి, బాగున్నాయని అభినందించారు. ఈ చిత్రానికి చంద్రబోస్‌గారు పాటలు రాయడంతో పాటు ఓ ప్రత్యేక గీతం ఆలపించడం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి. అమర్, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: భాస్కర్, రామారావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement