
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న సైబర్ క్రైమ్ రోజురోజుకూ విస్తృతం అవుతోందని, దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ అన్నారు.
ముఖ్యంగా ఫేక్‌బుక్‌లు ఎక్కువయ్యాయని, వాట్సాప్ వంటి గ్రూపుల్లో ముఖ్యమంత్రి సహా, మంత్రులు, ఎమ్మెల్యేలపై కామెంట్లు, తప్పుడు పోస్టింగ్‌లు ఎక్కువయ్యాయని తెలిపారు. దీంతోపాటే బ్లూవేల్ గేమ్ ద్వారా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. వీటిని నిలువరించేందుకు ప్రత్యేక చట్టాలు తేవాలని అన్నారు.