నెక్ట్స్‌ మూడు సినిమాలు ఒకే బ్యానర్‌లో..! | Aadi signs 3 movies with Gnanavel Raja | Sakshi
Sakshi News home page

నెక్ట్స్‌ మూడు సినిమాలు ఒకే బ్యానర్‌లో..!

Nov 1 2017 2:09 PM | Updated on Nov 1 2017 2:09 PM

Aadi signs 3 movies with Gnanavel Raja

స్టార్‌ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌, విజయాలు సాదించటంలో మాత్రం తడబడుతున్నాడు. కెరీర్‌ స్టార్టింగ్‌ లో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి సినిమాలతో విజయాలు అందుకున్నా తరువాత ఆ ట్రాక్‌ రికార్డ్‌ ను కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డాడు. శమంతకమణితో మల్టీ స్టారర్‌ సినిమా చేసినా అది కూడా ఆది కెరీర్‌కు పెద్దగా ప్లస్‌ అవ్వలేదు. అయితే ఈ శుక్రవారం రిలీజ్‌ అవుతున్న నెక్ట్స్‌నువ్వే మీదే ఆశలు పెట్టుకున్నాడు ఈ యంగ్‌ హీరో.

ప్రభాకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిజల్ట్‌ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌ గా ఉన్నాడు ఆది. అంతేకాదు నెక్ట్స్‌నువ్వే సినిమా నిర్మాతల్లో ఒకరైన తమిళ ప్రొడ్యూసర్‌ జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలో వరుస సినిమాలకు ఓకె చెప్పాడు. ఆది తన తదుపరి మూడు చిత్రాలను జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలోనే చేయనున్నాడట. వీటిలో రెండు ద్విభాషా చిత్రాలు కాగా మరోటి తెలుగు సినిమా. రిలీజ్‌ కు రెడీగా ఉన్న నెక్ట్స్‌ నువ్వే చిత్రాన్ని వి4 క్రియేషన్స్‌ బ్యానర్‌ పై అల్లు అరవింద్‌, జ్ఞానవేల్‌రాజా, యువి క్రియేషన్స్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement