కడవకల్లులో ప్రభాకర్ అనే యువకుడిని సోమవారం రాత్రి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారని పోలీసులు తెలిపారు.
కడవకల్లులో దేహశుద్ధి
Oct 19 2016 12:05 AM | Updated on Sep 4 2017 5:36 PM
పుట్లూరు: కడవకల్లులో ప్రభాకర్ అనే యువకుడిని సోమవారం రాత్రి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారని పోలీసులు తెలిపారు. గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఓ బాలికతో అదే కాలనీకి చెందిన ప్రభాకర్ చనువుగా మాట్లాడుతున్నాడనే కారణంతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు.
అంతటితో ఆగకుండా ఎస్సీ కాలనీలోని రచ్చబండ వద్ద చెట్టుకు కట్టేసి మరీ హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సురేశ్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని విడిపించారు. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు బాలిక తల్లిదండ్రులతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు.
Advertisement
Advertisement