ఏనుగు పిల్లని బలి ఇస్తారా? | Elephant Sacrifice Calf Movie Bahubali Prabhakar | Sakshi
Sakshi News home page

ఏనుగు పిల్లని ఎందుకు బలి ఇవ్వాలనుకున్నారు?

Jun 7 2023 3:10 PM | Updated on Jun 7 2023 3:14 PM

Elephant Sacrifice Calf Movie Bahubali Prabhakar - Sakshi

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో కె.శ‌ర‌వ‌ణ‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న విభిన్నాత్మ‌క చిత్రం `పోయే ఏనుగు పోయే`. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై యూట్యూబ్‌లో మంచి వ్యూస్ రాబ‌ట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని జూన్ 9న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతోంది.
 (ఇదీ చదవండి: చెప్పులు లేకుండా ఫ్యాన్స్‌ను ఎందుకు కలుస్తానంటే: అమితాబ్‌)

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత కె.శ‌ర‌వ‌ణ‌న్ మాట్లాడుతూ...  'బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుంది.  కొంత మంది నిధిని దక్కించుకోవడానికి  ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ప్ర‌తి సీన్ అడ్వెంచ‌రస్‌గా ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది.  అద్భుతమైన  గ్రాఫిక్స్‌తో  విజువల్ వండర్‌గా సినిమాను తీర్చి దిద్దాము. ఈ నెల 9న విడుద‌ల‌వుతోన్న మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా' అన్నారు.

(ఇదీ చదవండి: శ్రీవారి ఆలయం ముందు హీరోయిన్‌కు ముద్దు పెట్టిన ఆదిపురుష్‌ డైరెక్టర్‌)

Advertisement
 
Advertisement
Advertisement