యూత్‌ని ఆకట్టుకునేలా ‘రాజుగారి కోడిపులావ్’ | Rajugari Kodipulao Movie Latest Update | Sakshi
Sakshi News home page

యూత్‌ని ఆకట్టుకునేలా ‘రాజుగారి కోడిపులావ్’

Jun 4 2023 4:52 PM | Updated on Jun 4 2023 4:52 PM

Rajugari Kodipulao Movie Latest Update - Sakshi

శివా కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘రాజు గారి కోడిపులావ్’. కుటుంబ కథా 'వి'చిత్రం అనేది శీర్షిక. ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రంలో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.  శివ కోన, కునల్ కౌశల్, నేహా దేష్ పాండే, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా రాజు గారి కోడిపులావ్ సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ అలాగే సినిమా ఔట్ లైన్ కూడా తెలిపే ఒక వీడియోను విడుదల చేశారు.

‘రీయూనిన్ తో కలిసిన 6 మంది స్నేహితులు.. సరదాగా గడపడానికి ఒక అడవి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఊహించని సంఘటనలు ఎదురైతాయి. ఆ సంఘటనల నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వారు చేసే పోరాటమే ‘రాజుగారి కోడిపులావ్’. యూత్‌ని ఆకట్టుకునే అంశాలతో ఈ మూవీని గ్రాండ్‌గా తెరకెక్కించాం’అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement