సరికొత్త కాన్సెప్ట్‌తో ‘గోకులంలో గోవిందుడు’

Gokulamlo Govindudu Movie Shoot Start From February - Sakshi

గతంలో తమిళ హీరో విక్రమ్‌తో ‘ఊహ’, వడ్డే నవీన్‌తో ‘శ్రీమతి కల్యాణం’లాంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు ప్రభాకర్ తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ మూవీకి ‘గోకులంలో గోవిందుడు’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ పతాకంపై  వ్యాపారవేత్త పి.ఎన్.రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ పనులతోపాటు నటీనటులు-సాంకేతిక నిపుణుల ఎంపిక జరుపుకొంటున్న ‘గోకులంలో గోవిందుడు’ఫిబ్రవరి ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లనుందని మూవీ మేకర్స్‌ తెలిపారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top