అప్పుల బాధతో అన్నదాత మృతి | The farmer killed | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో అన్నదాత మృతి

Dec 27 2015 2:02 PM | Updated on Sep 3 2017 2:40 PM

అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ కౌలు రైతు గుండెపోటుతో మృతి చెందాడు.

అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ కౌలు రైతు గుండెపోటుతో మృతి చెందాడు. కర్నూలు జిల్లా పాములపాడు మండలం భానుముక్కలపాడు గ్రామానికి చెందిన గడ్డం ప్రభాకర్ (45) రూ.4 లక్షలు అప్పులు చేశాడు. నాలుగు ఎకరాల కౌలు భూమిలో మొక్కజొన్న సాగు చేయగా అది ఎండిపోయింది. అప్పులు తీర్చే విషయంలో తీవ్ర ఆందోళన చెందిన అతడు శనివారం రాత్రి అదే విషయమై కుటుంబ సభ్యుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అతడు గుండెపోటుతో మృతి చెందాడు.



 

Advertisement
 
Advertisement
Advertisement