ప్రేక్షకుడి హాస్యం | Prekshakudu Movie Title Logo Launch | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుడి హాస్యం

Oct 16 2018 12:39 AM | Updated on Oct 16 2018 12:39 AM

Prekshakudu Movie Title Logo Launch - Sakshi

ప్రభాకర్, కెవి రెడ్డి, పిల్లా రాజా, శ్రీవాణి

నూతన నటీనటులతో కె.వి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రేక్షకుడు’. రేఖ సాయిలీల ప్రొడక్షన్స్‌ పతాకంపై పిల్లా రాజా నిర్మిస్తున్న ఈ సినిమా లోగోను న్యాయవాది ఎస్‌.వరలక్ష్మి విడుదల చేశారు. ఈ సందర్భంగా కె.వి.రెడ్డి, పిల్లా రాజా మాట్లాడుతూ– ‘‘పశ్చిమ గోదావరి జిల్లాలో చలమయ్యగారి మిఠాయికొట్టు చాలా ఫేమస్‌. అందులోని స్వీట్స్‌లాగే ఈ చిత్రం మధురంగా ఉంటుంది.

వైవిధ్యమైన కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. కథానుగుణంగానే టైటిల్‌ పెట్టాం. ఈ నెల 25 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం. అంతర్వేది, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌ ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. మున్నాకాశీ చక్కని బాణీలు అందిస్తున్నారు.  ప్రేక్షకుల్ని మా సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నటీనటులు ప్రభాకర్, శ్రీవాణి, మున్నాకాశీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement