‘తుపాకీ రాముడు’గా బిత్తిరి సత్తి | Bithiri Sathi Turns Hero With Tupaki Ramudu | Sakshi
Sakshi News home page

Mar 20 2018 12:43 PM | Updated on Mar 20 2018 12:43 PM

Bithiri Sathi Turns Hero With Tupaki Ramudu - Sakshi

ఓ టీవీ ఛానల్‌ కార్యక్రమంతో ఫేమస్‌ అయిన బిత్తిరి సత్తి ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. పలు టీవీ షోలకు గెస్ట్‌ గానూ వ్యవహరిస్తున్న సత్తి త్వరలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలంగాణ కళాకరుడు, ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి రసమయి బాలకిషన్ నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాలో బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో నటించనున్నాడు.

బతుకమ్మ సినిమాకు దర్శకత్వం వహించిన టి.ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌కు తుపాకీ రాముడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్‌ 2న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement