ఆది హీరోగా 'నెక్ట్స్ ఏంటి..?' | Aadi, prabhakar Movie title Next Enti.. | Sakshi
Sakshi News home page

ఆది హీరోగా 'నెక్ట్స్ ఏంటి..?'

Jun 20 2017 12:30 PM | Updated on Sep 5 2017 2:04 PM

ఆది హీరోగా 'నెక్ట్స్ ఏంటి..?'

ఆది హీరోగా 'నెక్ట్స్ ఏంటి..?'

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది. డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది. డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ఆది.. హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా.. స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయాడు. కెరీర్ స్టార్టింగ్లో ఒకటి రెండు సక్సెస్లు వచ్చినా.. తరువాత వరుస ఫ్లాప్లు నిరాశపరిచాయి. ప్రస్తుతం మల్టీ స్టారర్గా తెరకెక్కుతున్న శమంతకమణి సినిమాలో నటిస్తున్న ఆది తరువాత సోలో హీరోగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

బుల్లితెరపై నటుడిగా, దర్శకుడిగా సక్సెస్ సాధించిన ప్రభాకర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా వీ4 మూవీస్ బ్యానర్పై నిర్మిస్తున్న సినిమాలో ఆది హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన కామెడీ థ్రిల్లర్ 'యామిరుక్క భయమే'కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నెక్ట్స్ ఏంటి..? అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఇటీవల సూపర్ హిట్ అయిన నాని సినిమాలోని పాట పల్లవిని ఆది సినిమాకు టైటిల్గా నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement