యూపీలో యోగికి గుడి

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు యూపీలోని భరత్‌కుండ్‌కు చెందిన ప్రభాకర్‌మౌర్య అనే వీరాభిమాని గుడి కట్టాడు. యోగి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కాషాయ వస్త్రాలు, విల్లంబులతో దేవతల మాదిరిగా తల వెనుక వెలుగులతో ఏర్పాటు చేశాడు. రోజుకు రెండు సార్లు పూజలు చేసి, భక్తులకు ప్రసాదం పంచిపెడుతున్నాడు.
ఫైజాబాద్–ప్రయాగ్‌రాజ్ హైవే పక్కనే భరత్‌కుండ్ ఉంది. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరత్‌కుండ్ రామాయణ కాలంలో అరణ్యవాసం వెళ్లే శ్రీరాముడికి ఆయన సోదరుడు భరతుడు వీడ్కోలు పలికిన చోటుగా ప్రసిద్ధి. యోగి కార్యక్రమాలతో ప్రభావితమై ఆయనకు గుడి కట్టినట్లు మౌర్య తెలిపాడు.