రారండోయ్‌

Prabhakar Book Will Release In Karimnagar - Sakshi

 వైరాగ్యం ప్రభాకర్‌ కథల సంపుటి ‘రెండు తలల పాము’ ఆవిష్కరణ అక్టోబర్‌ 29న సాయంత్రం 5:30కు కరీంనగర్‌లోని ఫిలిమ్‌ భవన్‌లో జరగనుంది. ఆవిష్కర్త: పత్తిపాక మోహన్‌. వక్త: బి.వి.ఎన్‌.స్వామి. నిర్వహణ: తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్‌ జిల్లా. ‘క్రాంతదర్శి: కందుకూరి’, ‘భారతదేశంలో తెలుగు స్థానం’ పుస్తకాల ఆవిష్కరణ సభ అక్టోబర్‌ 31న సాయంత్రం 6 గంటలకు న్యూ వుడ్‌లాండ్స్‌ హోటల్, మైలాపూరు, చెన్నైలో జరగనుంది. వక్త: రామతీర్థ. నిర్వహణ: చెన్నపురి తెలుగు వాణి. కె.శాంతారావు కవితా సంపుటి ‘మహాబాటసారి’ ఆవిష్కరణ నవంబర్‌ 3న సాయంత్రం 6 గంటలకు విజయవాడ గవర్నరుపేటలోని ఎం.బి.భవన్‌ మినీ హాల్‌లో జరగనుంది. ఆవిష్కర్త:  మండలి బుద్ధప్రసాద్‌. వక్త: దీర్ఘాసి విజయభాస్కర్‌. నిర్వహణ: ‘వనమాలి–మల్లెతీగ’.

 ‘లేఖిని’ ఆధ్వర్యంలో రచయిత్రుల కోసం ప్రత్యేకంగా యద్దనపూడి సులోచనారాణి స్మారక కథల పోటీ నిర్వహిస్తున్నట్టు ప్రధాన కార్యదర్శి స్వాతి శ్రీపాద తెలియజేస్తున్నారు. మూడు బహుమతులు వరుసగా 10 వేలు, 8 వేలు, 5 వేలు. ప్రత్యేక బహుమతులు వెయ్యి చొప్పున రెండు. డీటీపీలో ఆరు పేజీలకు మించని కథలను నవంబర్‌ 30 లోగా పంపాలి. వివరాలకు: 8297248988. చిరునామా. లేఖిని, కేరాఫ్‌ డాక్టర్‌ వాసా ప్రభావతి, 11/2ఆర్‌టీ మున్సిపల్‌ కాలనీ, మలక్‌పేట, హైదరాబాద్‌–36. కర్ణాటక తెలుగు సాహితీ సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని(2019 ఫిబ్రవరి 21)ని పురస్కరించుకొని మహాకవి పోతన భాగవతంలోని 2, 3వ స్కంధాలలోని విషయంపై ‘ఛందోబద్ధ గేయ, కవితా పోటీలు’ నిర్వహిస్తోంది. ఎన్నికైన ప్రతి రచనకు రూ.5,000 పురస్కారం. చివరి తేది: 30 డిసెంబర్‌ 2018. చిరునామా: రాఘవ మాస్టర్, కేరాఫ్‌ క.తె.సా.స., అంజనాద్రి టవర్స్, మూడో అంతస్తు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పైన, హెచ్‌ఆర్‌బీఆర్‌ లే అవుట్, కళ్యాణ్‌ నగర్, బెంగుళూరు–560043. మెయిల్‌: ట్చజజ్చిఠ్చిఛిౌఝఝ్ఛటఛ్ఛిఃజఝ్చజీl.ఛిౌఝ
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top