Kangana Ranaut-Mrunal Thakur: ‘సీతారామం’ చూసిన ఫైర్‌ బ్రాండ్‌ కంగనా, మృణాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

Kangana Ranaut Praises Sita Ramam Actress Mrunal Thakur And Other Team - Sakshi

సీతారామం హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌పై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిన్న సీతారామం సినిమా చూసిన ఆమె సోషల్‌ మీడియా వేదికగా చిత్ర దర్శకుడు హాను రాఘవపూడి, మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు మూవీ చాలా అద్భుతంగా ఉందని, ఈ ఎపిక్‌ లవ్‌స్టోరీ చూస్తున్నంత సేపు మధురానుభూతి కలిగిందంటూ తన అనుభవాన్ని పంచుకుంది.

చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్‌.. అసలు కారణమిదే!

స్క్రీన్‌ప్లే అయితే అత్యంత అద్భుతమంటూ కంగనా సీతారామం చిత్రాని కొనియాడింది. అలాగే హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ గురించి స్పెషల్‌గా మరో పోస్ట్‌ పెట్టింది. ‘ఈ సినిమాలోని నటీనటులందరు చాలా అద్భుతంగా నటించారు. అందులో మృణాల్‌ నటన బాగా ఆకట్టుకుంది. భావోద్యేగ సన్నివేశాల్లో ఆమె నటించిన తీరు అత్యద్భుతం. తనలా మరేవరూ నటించలేరు అనేంతగా నటన కనబరించింది. మృణాల్‌ నిజంగానే రాణి. జిందాబాద్‌ ఠాకూర్‌ సాబ్‌. ఇక ముందు ముందు కాలం మీదే’ అంటూ మృణాల్‌పై ప్రశంసలు కురిపించి కంగనా. 

కాగా దుల్కర్‌ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో అందమైన ప్రేమ కావ్యంగా రూపొందిన ‘సీతారామం’ మూవీ అన్ని భాషల్లో ఘనవిజయం సాధించింది. అన్నివర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మారథం పట్టారు. మొత్తంగా ఈ చిత్రం రూ. 100 కోట్ల కలెక్షన్స్‌ను దాటింది. ఇక ఇటీవల ఈ మూవీ హిందీ వెర్షన్‌ విడుదల కాగా అక్కడ సైతం ఈ మూవీ విశేష ప్రేక్షాదర పొందుతుంది. ఇప్పటికే ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి తన రివ్యూ ప్రకటిస్తూ మూవీ హీరోహీరోయిన్లపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. 

చదవండి: SSMB28: మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ సినిమాకు బ్రేక్‌! అసలు కారణమిదేనా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top