ఓటీటీలు వచ్చాక సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. థియేటర్లలో సందడి చేసిన నెల రోజుల్లోపే ఓటీటీల్లో దర్శనమిచ్చాయి. మరికొన్ని సినిమాలు ఏకంగా వారాల్లోపే స్ట్రీమింగ్ కూడా అవుతున్నాయి. తాజాగా మరో లేటేస్ట్ తెలుగు సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వస్తోన్న థాంక్యూ సుబ్బారావు స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది.
ఈ విషయాన్ని ఆహా సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. జూన్ 18 నుంచి థాంక్యూ సుబ్బారావు స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ఈ సినిమాకు చెందు ముద్దు దర్శకత్వం వహించారు. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర నిర్మించగా.. ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు.
ఈ మూవీ కథేంటంటే..
ట్రైన్ జర్నీలో పరిచయం లేని ఓ అమ్మాయి చుట్టూ తిరిగే క్రైమ్ కథాంశంగా రూపొందించారు. సస్పెన్స్, లవ్, కామెడీ, యాక్షన్ అంశాలతో సినిమాను తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌తో ఈ మూవీ కథేంటో ముందే పరిచయం చేశారు. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించారు.
A story filled with emotions, relationships, and unforgettable moments is ready to reach your screens!#ThankYouSubbarao starts streaming on @ahavideoIN from June 18th.https://t.co/JvRngv6wYh
Don't miss this heartwarming entertainer!#ThankYouSubbaraoOnAha@KurraP68246… pic.twitter.com/ODQe1g7LcD— SR PROMOTIONS (@SRPROMOTIONS29) June 15, 2026


