ఆటిట్యూడ్ స్టార్ 'కాయిన్' మూవీ గ్లింప్స్ విడుదల | Chandra Haas Movie Coin First Glimpse Out Now | Sakshi
Sakshi News home page

ఆటిట్యూడ్ స్టార్ 'కాయిన్' మూవీ గ్లింప్స్ విడుదల

Sep 18 2025 10:17 AM | Updated on Sep 18 2025 10:33 AM

Chandra Haas Movie Coin First Glimpse Out Now

వరుస చిత్రాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నిరంతరం పని చేస్తున్నారు. హీరోగా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌తో శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా జైరామ్ చిటికెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కాయిన్’. చంద్రహాస్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘‘కాయిన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్‌తో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. చంద్రహాస్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ‘కాయిన్’ చుట్టూ ఇంత జరిగిందా? అని కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. ట్రైలర్ వచ్చిన తరువాత చిత్రంపై మరింత అంచనాలు పెరుగుతాయని నమ్మకంగా ఉన్నాను. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ .. ‘యథార్థ సంఘటనల ఆధారంగా మా దర్శకుడు జైరామ్ ఈ ‘కాయిన్’ మూవీని తీస్తున్నారు. పాత ఐదు రూపాయల కాయిన్స్‌ని బ్యాన్ చేయడం, ఆ కాయిన్స్ మెల్ట్ చేయడం, వాటి నేపథ్యంలో క్రైమ్ అనే పాయింట్లతో అద్భుతంగా కథను రాసుకున్నారు. జైరామ్ పనితనం నాకు చాలా నచ్చింది. జైరామ్ భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ అవుతారు. ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్‌ను లాంచ్ చేసేందుకు వచ్చిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. నిమిషి మ్యూజిక్ డైరెక్టర్‌గా పెద్ద స్థాయికి వెళ్తారు. శ్రీకాంత్ రాజా రత్నం ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత. ఆయనకు కథపై చాలా నమ్మకం ఉంది. నేను కథ నచ్చితే ఏ జానర్ అన్నది ఆలోచించను. అన్ని రకాల చిత్రాలను చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి, నన్ను ట్రోల్ చేసే వారికి సమాధానం చెప్పేందుకు నేను ఎప్పుడూ కష్ట పడుతూనే ఉంటాను’ అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement