
ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తీస్తున్న లవ్ స్టోరీకి 'కాగితం పడవలు' అనే టైటిల్ నిర్ణయించారు. కీర్తన నరేష్, ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'చాలా దూరం వెళ్ళిపోయావు గోదావరి. నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్' అనే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. తీరంలో ఓ జంట కలుసుకోవడం, విజువల్స్, నేపధ్య సంగీతం లాంటివి అలరిస్తున్నాయి.
దర్శకుడు ఎంజీఆర్ తుకారాం లవ్లీ ఎమోషన్స్, హృదయాన్ని తాకే కథ, అందమైన విజువల్స్‌తో ఈ చిత్రాన్ని మలిచినట్లు గ్లింప్స్ చూస్తే అర్ధమవుతోంది. ఈ చిత్రానికి నౌఫల్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. రుద్రసాయి & జానా డీవోపీగా పని చేస్తున్నారు. జెస్విన్ ప్రభు ఎడిటర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.హిమ బిందు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.