
నిజజీవిత కథలు, సంఘటనలు స్ఫూర్తిగా తీసుకుని తెలుగులో ఎప్పటికప్పుడు సినిమాలు తీస్తూనే ఉంటారు. ఇప్పుడు అలా రాబోతున్న మరో మూవీ 'గరివిడి లక్ష‍్మి'. చాన్నాళ్ల క్రితమే ఈ చిత్రం నుంచి 'నల్లజీలకర్ర మొగ్గ' అని సాగే ఓ పాటని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు గ్లింప్స్ విడుదల చేశారు. ప్రధాన పాత్రధారిని పరిచయం చేశారు.
(ఇదీ చదవండి: 'జూనియర్' రెండు రోజుల కలెక్షన్ ఎంతంటే?)
ఉత్తరాంధ్ర జిల్లాల్లో బుర్రకథ అంటే తెలియని వారుండరు. పండగలు, ఉత్సవాల టైంలో బుర్రకథల్ని ఎక్కువగా వేస్తుంటారు. 90ల కాలంలో దాదాపు 15 ఏళ్లలో ఏకంగా 10 వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష‍్మీ అనే ఆమె జీవితం ఆధారంగా ఈ సినిమా తీసినట్లు చిత్రబృందం ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. గ్లింప్స్ కూడా సింపుల్‌గానే ఉంది. లక్ష‍్మీ పాత్రలో ఆనంది నటించబోతుంది. ఇదివరకే ఈమె.. జాంబీరెడ్డి, భైరవం తదితర సినిమాల్లో నటించింది.
(ఇదీ చదవండి: యంగ్ హీరో నిఖిల్‌కి ఝలక్.. ట్వీట్ వైరల్)