
'క' సినిమాతో గతేడాది హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం.. ఈ ఏడాది 'దిల్‌రుబా' మూవీతో చాన్నాళ్ల క్రితమే వచ్చాడు. ఇది ఘోరమైన డిజాస్టర్ అయింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో 'కె-ర్యాంప్' పేరుతో తీస్తున్న ఓ చిత్రముంది. ఇప్పుడు దాని గ్లింప్స్ రిలీజ్ చేయడంతో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఈ గుండుపాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టారా?)
'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. తర్వాత చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ హిట్స్ కొట్టలేకపోయాడు. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని విసిగించాడు. ఎట్టకేలకు 'క' అనే థ్రిల్లర్‌తో హిట్ కొట్టాడు. మరి ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడో ఏమో గానీ క అక్షరం కలిసొచ్చేలా 'కె-ర్యాంప్' సినిమా చేశారు. దీని గ్లింప్స్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. గత చిత్రాలతో పోలిస్తే కిరణ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు.
ఇందులో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్. జైన్స్ నాని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గ్లింప్స్ బట్టి చూస్తుంటే సినిమా అంతా కేరళలో షూట్ చేశారు. ఈ అక్టోబరు 18న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: 'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా?)