
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న చిత్రం మారెమ్మ. ఈ మూవీలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చేసింది. ఇవాళ మాధవ్ భూపతిరాజు పుట్టినరోజు కావడంతో గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్.
తాజా గ్లింప్స్ చూస్తే మాధవ్ మాస్ లుక్లో కనిపించాడు. కబడ్డీ కోర్టులో ఫుల్ మాస్ యాక్షన్ హీరో లుక్లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందిస్తున్నారు. కాగా.. మాధవ్ ఇప్పటికే మిస్టర్ ఇడియన్ అనే చిత్రంలో కనిపించారు.