'ఓ భామ అయ్యో రామా' అంటోన్న సుహాస్ .. గ్లింప్స్‌ వచ్చేసింది! | Suhas 'Oh Bhama Ayyo Rama' Glimpse Out Now | Sakshi
Sakshi News home page

Oh Bhama Ayyo Rama Glimpse: 'ఓ భామ అయ్యో రామా' అంటోన్న సుహాస్ .. గ్లింప్స్‌ చూశారా!

Dec 25 2024 3:18 PM | Updated on Dec 25 2024 3:35 PM

Suhas 'Oh Bhama Ayyo Rama' Glimpse Out Now

ఇటీవల జనక అయితే గనక అనే సినిమాతో అభిమానులను అలరించిన హీరో సుహాస్. సరికొత్త కథలతో ఆడియన్స్‌ను అలరిస్తోన్న సుహాస్ మరో కథతో రెడీ అయిపోయారు. 'ఓ భామ అయ్యోరామా' అంటూ వచ్చేస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవిక మనోజ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించి ‍అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. క్రిస్‌మస్‌ సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. 'దేవుడినైనా రాముడినైనా నడిపించేది ఆడదే' అనే డైలాగ్‌ ఈ మూవీపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమాను వీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై హరీశ్ నల్లా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథివీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాథ్విక్ ఆనంద్, నాయని పావని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement