ఓటీటీకి ది ప్యారడైజ్.. అఫీషియల్ ప్రకటన | Nani Latest Movie The Paradise Ott Release Date announced offcially | Sakshi
Sakshi News home page

The Paradise Ott: ఓటీటీకి ది ప్యారడైజ్.. అఫీషియల్ ప్రకటన

Oct 18 2026 11:44 AM | Updated on Oct 18 2026 12:03 PM

Nani Latest Movie The Paradise Ott Release Date announced offcially

నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఓ జాతి మనుగడ కోసం చేసే పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ అనుకన్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈనెల 22 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని వెల్లడించారు. థియేటర్లలో రాణించలేని ఈ మూవీ ఓటీటీ ప్రియులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఈ సినిమా ఓటీటీలో థియేట్రికల్ వర్షన్ ఉంటుందా? లేదా అదనంగా ఇంకా ఏమైనా సీన్స్ యాడ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా.. మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించారు. ఈ మూవీలో సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత సుధాకర్ చెరుకూరి  నిర్మించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement