రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ జైలర్-2. గతంలో రిలీజైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం త్రీ డేస్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల వసూళ్లు దాటేసింది.
ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ శాక్నిల్క్ ప్రకారం.. 'జైలర్- 2' శనివారం ఒక్క రోజే రూ.47.80 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.144.60 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాగా.. రూ. 169.65 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఓవర్సీస్లో రూ.47.50 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాగా.. రూ.147.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.317.15 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా.. ఈ చిత్రంలో విద్యా బాలన్, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ కీలక పాత్రల్లో నటించారు.


