ఫుల్ ఎమోషనల్ లవ్‌ స్టోరీ.. గ్లింప్స్‌ రిలీజ్ | Lakshman Tekumudi Premaledhani Movie Offical Glimpse | Sakshi
Sakshi News home page

Premaledhani Movie: ఎమోషనల్ లవ్‌ స్టోరీ.. గ్లింప్స్ వీడియో చూశారా?

Oct 27 2025 9:11 PM | Updated on Oct 27 2025 9:11 PM

Lakshman Tekumudi Premaledhani Movie Offical Glimpse

లక్ష్మణ్ టేకుముడి , రాధికా జోషి హీరో, హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం 'ప్రేమ లేదని'. ఈ మూవీకి జీడీ నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ మూవీని జీడీఆర్ మోషన్ పిక్చర్ బ్యానర్‌లో శ్రీని ఇన్‌ఫ్రా నిర్మిస్తున్నారు. హార్ట్ ఫుల్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి బిగ్‌ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని రూపొందించినట్లు గ్లింప్స్‌లో సీన్స్‌ చూస్తేనే అర్థమవుతోంది. మందు, సిగరెట్‌ కాదు.. అబ్బాయిలకు హానికరం అమ్మాయిలు అనే చివర్లో వచ్చే డైలాగ్ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ రోజుల్లో ట్రెండ్‌కు తగినట్లుగానే ప్రేమలేదని మూవీని ప్రేక్షకుల ముందుకొస్తున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ సుహాస్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో సురేశ్ గురు, గాయత్రి కీలక పాత్రల్లో నటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement