టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రస్తుతం హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ఓ శాంతి శాంతి శాంతిః. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఈషా రెబ్బా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా..తరుణ్ సైతం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హజరయ్యారు తరుణ్ భాస్కర్. ఈ సందర్భంగా హీరోయిన్ ఈషాతో రిలేషన్‌పై ఆయనకు ప్రశ్న ఎదురైంది. మీపై వస్తున్న రూమర్స్‌పై ఏమంటారు? అని ప్రశ్నించారు. దీనికి తరుణ్ భాస్కర్ స్పందించారు. తాను ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువని తెలిపారు. ఇది నా పర్సనల్ కాబట్టి.. టైమ్ వచ్చినప్పుడు అన్ని చెప్తా అన్నారు. నేను ఏదైనా చెప్తే.. దాని వల్ల ఎవరైనా ఇబ్బంది పడడం తనకు ఇష్టం లేదన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానని తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు.
కాగా.. ప్రస్తుతం వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో నటించారు. ఎ.ఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న విడుదల కానుంది. ఇది మలయాళ మూవీ జయ జయ జయహేకి రీమేక్‌గా తెరకెక్కించారు.
(ఇది చదవండి: తరుణ్‌తో డేటింగ్? తొలిసారి స్పందించిన హీరోయిన్)
తర్వాత చెప్తా: ఈషా రెబ్బా
ఇటీవల సినిమా ప్రమోషన్స్‌కు హాజరైన ఈషా రెబ్బాకు సైతం తరుణ్‌తో డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది. తెరపై జంటగా నటించిన తరుణ్- ఈషా.. రియల్ లైఫ్‌లోనూ జోడీయేనా? అన్న ప్రశ్నకు ఆమె ఇలా స్పందించింది. 'ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం మంచిదే! అయితే దేనిపైనా క్లారిటీ ఇవ్వదల్చుకోలేదు. ఏదైనా ఉంటే నేనే అందరికీ చెప్తాను' అని బదులిచ్చింది. వీరిద్దరి రిలేషన్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.


