తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళ హిట్ ఫిల్మ్ ‘జయ జయ జయ జయహే’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న కానుంది. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో శాంతి అనే పాత్ర చేశాను.
ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాను. నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాను. ఈ సినిమాలో నేను చెంపదెబ్బలు తిన్న సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్‌లో నా కళ్ళలో వచ్చిన నీళ్ళు రియల్. ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ఈ సీన్‌లో తరుణ్ భాస్కర్‌కి, నాకూ దెబ్బలు తగిలాయి. సంజీవ్ క్లియర్ విజన్ ఉన్న దర్శకుడు. ప్రస్తుతం తెలుగులో కథలు వింటున్నాను. ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నాను’’ అని చెప్పారు.


