మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తొలిసారి వస్తోన్న భారీ బడ్జెట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఇటీవలే ఈ మూవీ టైటిల్‌ను దర్శకధీరుడు రివీల్ చేశారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఈవెంట్ ప్లాన్ చేసి మరి టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన గ్రాండ్ గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌కు మహేశ్ బాబు ఫ్యాన్స్ పెద్దఎత్తున హాజరయ్యారు.
అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ప్రతిష్టాత్మక గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లోనూ మెరిసింది బాలీవుడ్ బ్యూటీ. తన డ్రెస్‌తోనే అందరినీ ఆకట్టుకుంది. అయితే అంతకుముందే ప్రియాంక ట్విటర్ వేదికగా నెటిజన్లతో చిట్ చాట్ నిర్వహించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మీరు తెలుగులో మాట్లాడతారా? ఈ సినిమాలో మీ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్తారా? అంటూ ప్రియాంకను కొందరు నెటిజన్స్ ప్రశ్నించారు.
దీనిపై ప్రియాంక చోప్రా తన అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. 'వారణాసి' కోసం తెలుగులో తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నట్లు వెల్లడించింది. అవును నేనే డబ్బింగ్ చెప్తా.. తెలుగు కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపింది. తెలుగు నా ప్రాథమిక భాష కాదని.. అందుకే రాజమౌళి సార్ నాకు హెల్ప్ చేస్తున్నారని వెల్లడించింది. అంతకుముందు వారణాసి ఈవెంట్‌లో ఏదైనా తప్పులు దొర్లితే నన్ను క్షమించాలని అభిమానులను కోరింది. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో తగలబెట్టేద్దామా, మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా అంటూ డైలాగ్స్‌తో ప్రియాంక చోప్రా అభిమానులను అలరించింది.

కాగా.. వారణాసి చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హేశ్‌బాబు రుద్రగా కనిపించనుండగా.. మందాకిని పాత్రలో ప్రియాంక మెప్పించనుంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను 2027 వేసవిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.


