జోహో సీఈఓ రాజీనామా: న్యూ చాప్టర్ బిగిన్ అంటూ ట్వీట్ | Sridhar Vembu Steps Down As Zoho CEO | Sakshi
Sakshi News home page

జోహో సీఈఓ రాజీనామా: న్యూ చాప్టర్ బిగిన్ అంటూ ట్వీట్

Jan 27 2025 6:09 PM | Updated on Jan 27 2025 7:19 PM

Sridhar Vembu Steps Down As Zoho CEO

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ జోహో కార్పొరేషన్ (Zoho Corporation) ఫౌండర్ 'శ్రీధర్ వెంబు' (Sridhar Vembu) తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అయితే అదే కంపెనీలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేయనున్నట్లు తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

కంపెనీలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేస్తూ.. పరిశోధన, కంపెనీ అభివృద్ధికి దోహదపడనున్నట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వస్తున్న మార్పులతో పాటు.. తాము ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ వెంబు తెలిపారు. అంతే కాకుండా నేను నా వ్యక్తిగత గ్రామీణ అభివృద్ధి మిషన్‌ను కొనసాగించడంతో పాటు.. R&D కార్యక్రమాలపై పూర్తి సమయం దృష్టి కేటాయిస్తానని తెలిపారు.

కంపెనీ కో ఫౌండర్ శైలేష్ కుమార్ డేవే కొత్త సీఈఓగా వ్యవహరిస్తారు. మరో సహ వ్యవస్థాపకుడు టోనీ థామస్ జోహో యూఎస్‌ను లీడ్ చేస్తారు. రాజేశ్‌ గణేశన్‌ మేనేజ్‌ఇంజిన్‌ డివిజన్‌ను, మణి వెంబు జోహో.కామ్‌ డివిజన్‌ను లీడ్‌ చేస్తారని.. కంపెనీ భవిష్యత్తు పూర్తిగా మనం R&D ఛాలెంజ్‌ని ఎంత బాగా నావిగేట్ చేస్తాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నేను కూడా టెక్నికల్ వర్క్‌కి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని శ్రీధర్ వెంబు తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 365 రోజుల వ్యాలిడిటీ

1996లో శ్రీధర్ వెంబు AdventNet అనే నెట్‌వర్క్ పరికరాల ప్రొవైడర్ల కోసం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ హౌస్‌ను స్థాపించారు. ఇదే 2009లో జోహో కార్పొరేషన్‌గా మారింది. గత సంవత్సరం 5.85 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో 39వ సంపన్నుడిగా నిలిచిన శ్రీధర్ వెంబు.. 2021లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement