
స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ.. వాట్సాప్ గురించి తెలిసే ఉంటుంది. కానీ ఇలాంటి తరహా ఇండియన్ యాప్ 'అరట్టై' (Arattai) గురించి తెలుసా?. ఈ పేరును ఎప్పుడైనా విన్నారా?. బహుశా ఈ పేరు కొత్తగా అనిపించినప్పటికీ.. ఈ యాప్ మొదటిసారిగా 2021లో యాప్ స్టోర్‌లలోకి ప్రవేశించింది. అయితే భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత.. సోషల్ మీడియా వైరల్ అవ్వడంతో ఈ మేడ్ ఇన్ ఇండియా యాప్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.
అరట్టై యాప్ జోహో కంపెనీ రూపొందించింది. ప్రస్తుతం ఇది గూగుల్ ప్లే స్టోర్ & యాపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. దీనికి మెల్లగా ఆదరణ పెరుగుతోంది. దీన్నిబట్టి చూస్తే.. రానున్న రోజుల్లో మెటా మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
➤అరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.
➤అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.
➤అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్‌లు, ఇతర ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీతో కొత్త భాష.. కేవలం 30 రోజుల్లో!
➤అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు & పాత 2G/3G నెట్‌వర్క్‌లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
On Arattai, we have initiated discussions with Sharad Sharma of iSpirt, the group that did the technical work to make UPI happen, to standardize and publish the messaging protocols. I am a huge fan of UPI and hugely respect the work the team did. Sharad is a good friend and he…
— Sridhar Vembu (@svembu) September 30, 2025