
ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చే చాట్‌జీపీటీ (ChatGPT).. ఇప్పుడు కొత్త భాషలు (New Language) నేర్చుకోవడానికి కూడా సహకరిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే.. పదజాలం, వ్యాకరణం, మాట్లాడటం వంటివి సులభంగా నేర్చుకోవచ్చు!. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సులభంగా కొత్త భాషను 30 రోజుల్లో నేర్చుకోవడానికి 8 ప్రాంప్ట్‌లను ఉపయోగించాల్సి ఉంటుందని మార్కెటింగ్, గ్రోత్ నిపుణుడైన 'చిదానంద్ త్రిపాఠి' పేర్కొన్నారు. అవి ''30 రోజులలో భాషా అభ్యాస ప్రణాళిక, రోజువారీ పదజాలం, అభ్యాస అనుకరణ, సాధారణ పదాలలో వ్యాకరణ వివరణ, వినడం, నిజ జీవిత సంభాషణకు సంబంధించిన ఉదాహరణలను క్రియేట్ చేయడం, తప్పుల దిద్దుబాటు, మోటివేషనల్ చెక్''.
పైన చెప్పిన 8 ప్రాంప్ట్‌లను ఉపయోగించడం ద్వారా.. నెల రోజుల్లో కొత్త భాషను సులభంగా నేర్చుకోవచ్చని.. చిదానంద్ త్రిపాఠి పేర్కొన్నారు. ప్రాక్టీస్ చేయడానికి, పదాలను తెలుసుకోవడానికి చాట్‌జీపీటీ ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.
CHATGPT CAN TEACH YOU A NEW LANGUAGE - MASTER IT IN 30 DAYS
Use these 8 prompts to accelerate language acquisition:— Chidanand Tripathi (@thetripathi58) September 28, 2025