టెక్నాలజీపై నియంత్రణే అసలైన సార్వభౌమత్వం | Zoho founder Sridhar Vembu said nations must control core technologies | Sakshi
Sakshi News home page

టెక్నాలజీపై నియంత్రణే అసలైన సార్వభౌమత్వం

Jan 25 2026 5:18 AM | Updated on Jan 25 2026 5:18 AM

Zoho founder Sridhar Vembu said nations must control core technologies

దేశాలకు సాంకేతిక స్వయం ప్రతిపత్తి అత్యవసరం  

టెకీలు భారత్‌కు తిరిగి రావాలి 

జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు

న్యూఢిల్లీ: టెక్నాలజీపై నియంత్రణ కలిగి ఉండడమే అసలైన సార్వభౌమత్వమని జోహో సంస్థ వ్యవస్థాపకుడు చీఫ్‌ సైంటిస్ట్‌ శ్రీధర్‌ వెంబు అభిప్రాయపడ్డారు. సాంకేతికాభివృద్ధితో ప్రపంచం పరుగులు పెడుతున్న ప్రస్తుత తరుణంలో దేశాలకు సాంకేతిక స్వయం ప్రతిపత్తి అత్యవసరమన్నారు. కేంద్రం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ అజెండాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఈ లక్ష్యాల్లో తామూ భాగస్వామం కావడం ఆనందంగా ఉందన్నారు. జోహో పనితీరును కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ సీఈవోలు ప్రశంసిస్తున్నారని శ్రీధర్‌ తెలిపారు.  

మాతృభూమి అవకాశాలతో ఎదురుచూస్తోంది ..  
అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, సుంకాలు, వీసా అనిశి్చతుల నేపథ్యంలో భారతీయ వృత్తి నిపుణులు మాతృ దేశానికి రావాలని వెంబు పిలుపునిచ్చారు. ఇక్కడి అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలంటూ ఇతర దేశాల్లో పనిచేస్తున్న భారత వృత్తి నిపుణులను కోరారు. ప్రపంచస్థాయి కంపెనీలు సైతం విస్తరణ వ్యూహాల్లో భాగంగా మనదేశంలోనే గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయని గుర్తుచేశారు. ‘దేశ జనాభా, విద్యా వ్యవస్థ, మౌలిక వసతులు, ప్రభుత్వ విధానాల సమ్మేళనం భారత్‌ టెక్‌ వ్యవస్థకు పరిపూర్ణ మద్దతు ఇస్తున్నాయ’ని శ్రీధర్‌ తెలిపారు.

ఐపీఓపై ఆసక్తి లేదు.. 
జోహో సంస్థను ఐపీఓ ద్వారా స్టాక్‌ మార్కెట్‌లోకి తీసుకెళ్లే ఆసక్తి లేదని శ్రీధర్‌. సంస్థ ప్రైవేట్‌గా కొనసాగడం వల్ల పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)లో భారీగా పెట్టుబడులు పెడుతున్నామన్నారు. త్రైమాసిక ఫలితాల ఒత్తిళ్లకు లోనవాల్సిన అవసరం లేదని, అలాంటి తాత్కలిక లక్ష్యాలు తమకు ఇష్టం లేదని చెప్పారు. జోహో ఉత్పత్తుల ఆవిష్కరణలకు మూలధన నిధుల కంటే దీర్ఘకాలిక సహనం అవసరమన్నారు. దేశానికి దీర్ఘకాలిక దృష్టితో పనిచేసే, సహనంతో కూడిన ఆర్‌అండ్‌డీ ఆధారిత సంస్థలు మరిన్ని అవసరమన్నారు.  

ఎంటర్‌ప్రైజ్‌ రీసోర్స్‌ ప్లానింగ్‌ సొల్యూషన్‌ (ఈఆర్‌పీ) ఆవిష్కరణ..  
భారతీయ వ్యాపార కంపెనీల కోసం  దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మేడ్‌ ఇన్‌ ఇండియా ఎంటర్‌ప్రైజ్‌ రీసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) సొల్యూషన్‌ను శ్రీధర్‌ ఆవిష్కరించారు. ప్రస్తుతానికి ఈఆర్‌పీ సొల్యూషన్‌ భారత మార్కెట్‌కే పరిమితమవుతుందని, తరువాత దశలవారీగా ప్రపంచ మార్కెట్లోకి విస్తరించనుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి అ య్యేందుకు దాదాపు అయిదేళ్ల సమయం పట్టిందని, భవిష్యత్తులో జోహోకు ప్రధాన వృద్ధి ఇంజిన్‌ గా ఈఆర్‌పీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement