ఉచితంగా ఐటీ కోర్సులు.. 87 వేల మందికి.. | Nasscom Foundation IBM to upskill 87K youth in digital tech | Sakshi
Sakshi News home page

ఉచితంగా ఐటీ కోర్సులు.. 87 వేల మందికి..

Nov 27 2025 8:08 AM | Updated on Nov 27 2025 8:10 AM

Nasscom Foundation IBM to upskill 87K youth in digital tech

అట్టడుగు వర్గాల యువతకు భవిష్యత్‌ తరపు డిజిటల్‌ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు టెక్‌ దిగ్గజం ఐబీఎం, నాస్కామ్‌ ఫౌండేషన్‌ జట్టు కట్టాయి. ఐబీఎం స్కిల్స్‌బిల్డ్‌ ప్రోగ్రాం కింద 87,000 మందికి శిక్షణనివ్వనున్నాయి. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో ట్రైనింగ్‌ ఇచ్చి వారిలో ఉద్యోగ సామర్థ్యాలను పెంపొందించనున్నాయి.

ఈ ప్రోగ్రాం కింద కృత్రిమ మేథ (ఏఐ), సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్‌ తదితర అంశాల్లో ఉచితంగా డిజిటల్‌ కోర్సులు, శిక్షణను అందిస్తారు. మెంటార్స్‌ నుంచి కూడా మద్దతు ఉంటుంది. 2030 నాటికి 3 కోట్ల మందికి శిక్షణనివ్వాలన్న ఐబీఎం లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు, భారతదేశవ్యాప్తంగా హైబ్రిడ్‌ విధానంలో అమలవుతుంది.

ప్రాజెక్ట్‌ ప్రభావం

  • అట్టడుగు వర్గాల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.

  • పరిశ్రమకు అవసరమైన ప్రాక్టికల్‌ నైపుణ్యాలు అందుతాయి.

  • భారతదేశంలో డిజిటల్‌ సమానత్వం పెరుగుతుంది.

  • ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, పెద్ద కంపెనీలకు స్కిల్‌డ్‌ వర్క్‌ఫోర్స్ లభిస్తుంది.

  • ఇది కేవలం శిక్షణ ప్రోగ్రాం మాత్రమే కాదు, భారతదేశ డిజిటల్‌ భవిష్యత్తుకు పునాది వేసే ప్రయత్నం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement