స్కానింగ్‌ సెంటర్‌లోనే ప్రసవం!.. గంగరాజుపై పోక్సో కేసు | Minor Delivers Baby in Scanning Centre Restroom | Sakshi
Sakshi News home page

స్కానింగ్‌ సెంటర్‌లోనే ప్రసవం!.. గంగరాజుపై పోక్సో కేసు

Mar 5 2026 1:44 PM | Updated on Mar 5 2026 1:46 PM

Minor Delivers Baby in Scanning Centre Restroom

నాగర్‌కర్నూల్‌ క్రైం: మైనర్‌ను శారీరకంగా వాడుకుని ప్రసవానికి కారణమైన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌ తెలిపారు. ఈనెల 2న జిల్లాకేంద్రంలోని ఓ స్కానింగ్‌ సెంటర్‌లోని బాత్‌రూంలో మైనర్‌ బాలిక ప్రసవమైన సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గానికి చెందిన ఓ మైనర్‌ సమీప బందువు ప్రేమపేరిట మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకోవడంతో గర్భం దాల్చింది. 

సదరు వేసవి సెలవుల అనంతరం కేజీబీవీ హాస్టల్‌కు వెళ్లి అక్కడే ఉంటుంది. గర్భిణీ అనే విషయం దాచిపెట్టి కళాశాల అధ్యాపకులు, సిబ్బందికి కాలు ఫ్యాక్చర్‌ అయిందని, హాస్టల్‌ భోజనంతోనే లావు అవుతున్నానని సమాధాం చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన బాలికకు కడుపు నొప్పి రావడంతో స్కానింగ్‌ కోసం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌కు రావడంతో అక్కడే ప్రసవం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు స్కానింగ్‌ సెంటర్‌కు వెళ్లి తల్లి, మగ శిశువును జనరల్‌ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. 

తొలుత ఓ మైనర్‌ బాలుడిని తీసుకొచ్చి విచారణ జరపగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ బాలుడు పోలీసులకు చెప్పాడు. దీంతో బాలికను మరోసారి పోలీసులు గట్టిగా నిలదీసి.. వివరాలు సేకరించారు. తన ఇంటి సమీపంలో ఉన్న బంధువు గంగరాజు కారణమని బాలిక చెప్పడంతో... అతని గంగరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి బాలికను శారీరకంగా లోబర్చుకోవడం వల్లే తల్లి అయిందని విచారణలో తేలడంతో నిందితుడి గంగరాజుపై పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా.. నిందితుడికి ఇది వరకే పెళ్లి అయి.. ఇద్దరు పిల్లలున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement