సత్యానంద్‌ శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటా: పవన్‌ కల్యాణ్‌ | Pawan Kalyan Battula Talk About Purushah Movie | Sakshi
Sakshi News home page

సత్యానంద్‌ శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటా: పవన్‌ కల్యాణ్‌

May 24 2026 5:40 PM | Updated on May 24 2026 5:41 PM

Pawan Kalyan Battula Talk About Purushah Movie


పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’  ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేశారు. తాజాగా చిత్రబృందం థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించింది. 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బత్తుల మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్స్. నేను సత్యానంద్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పలేదు. ఒక వేళ నా నేను బాగా నటించకపోతే మీ పేరుకి ఎఫెక్ట్ అవుతుందని అనుకున్నాను. ఈ రోజు నా నటనకు మంచి పేరు వస్తోంది. అందుకే ఈ రోజు నేను సత్యానంద్ మాస్టర్ గారి శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇదంతా వీరు గారి వల్లే సాధ్యమైంది. ప్రీమియర్ల నుంచీ మా సినిమాకి మంచి టాక్ వచ్చింది. మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. మూవీని చూసి నాలోని ప్లస్, మైనస్‌లు చెప్పండి. మైనస్‌లు చెబితే వాటిని నేను అధిగమించేందుకు ప్రయత్నిస్తాను. మా సినిమాని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ఇంకా చూడనివారు మా మూవీని చూసి సపోర్ట్ చేస్తారని, మా కష్టాన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాను ఇంతటి స్థాయికి తీసుకు వెళ్లిన మీడియాకి థాంక్స్. ముగ్గురు హీరోయిన్లు చక్కగా నటించారు. వీరు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. కెమెరామెన్ సతీష్ గారు మంచి వ్యక్తి. సప్తగిరి గారు, కసిరెడ్డి గారు అద్భుతంగా నటించారు. పవన్ కళ్యాణ్ బత్తులని హీరోగా పెట్టి సినిమా తీస్తామని నా కంటే కోటీశ్వరులు ఫోన్ చేసి చెప్పారు. నేనే ఇంకో రెండు చిత్రాలు చేస్తానని వారికి చెప్పాను. ఎక్కడా కొత్త అబ్బాయిలా అనిపించలేదు. మా అబ్బాయి యాక్టింగ్ నాకు నచ్చింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరు వులవల, నటులు కసిరెడ్డి రాజ్‌ కుమార్‌, విషిక, హాసిని సుధీర్‌, సంధ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement