'బ్రహ్మచారి.. భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది' అనే క్యాప్షన్‌తో 'పురుష' ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ పోస్టర్ ఆవిష్కరించారు. బత్తుల సరస్వతి సమర్పణలో తన తనయుడు పవన్ కల్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ బత్తుల కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసినీ సుధీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం అని చిత్రయూనిట్ పేర్కొంది.


