నేను కాదు ఆమే లేడీ సూపర్‌స్టార్‌ : శ్రీలీల | Sreeleela Interesting Comments On Nayanthara | Sakshi
Sakshi News home page

నేను కాదు ఆమే లేడీ సూపర్‌స్టార్‌ : శ్రీలీల

May 11 2026 9:18 AM | Updated on May 11 2026 11:27 AM

Sreeleela Interesting Comments On Nayanthara

అనేక మందికి ఫేవరేట్‌గా మారిన నటి శ్రీలీల. అలాంటిది తన ఫేవరేట్‌ నయనతార అక్క అంటోంది బ్యూటీ. కోలీవుడ్‌లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కోలీవుడ్‌, బాలీవుడ్‌ల్లోనూ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకుంటున్నారు. ఇప్పటికే పరాశక్తి చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడభామ తాజాగా ధనుష్‌కు జంటగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలీల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

నేను వైద్య విద్యను అభ్యసించాను. డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. అయితే నటిగా మారాను. నేను ఈ రంగంలో సక్సెస్‌ కావడానికి నా తల్లే కారణం. ఇకపోతే అందరి జీవితాల్లోనూ జయాపజయాలు వస్తుంటాయి. వాటిని అంగీకరించాల్సిందే. నాకు అజయం ఎదురైతే ఒక గంటపాటు ఏడ్చేస్తాను. తర్వాత పనికి రెడీ అవుతాను.

 ఇప్పుడు హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్నాను. ఇప్పుడు దక్షిణాది, ఉత్తరాది సినిమా అనే తారతమ్యం లేదు. నన్ను కొందరు లేడీ సూపర్‌స్టార్‌ అంటున్నారు. దాన్ని నేను అంగీకరించను. నా ఫేవరేట్‌ నటి నయనతార. ఆమే లేడీ సూపర్‌స్టార్‌. నయనతార నా రోల్‌ మోడల్‌. చైన్నె యువత అంటే నాకు చాలా ఇష్టం. నయనతార మాదిరిగా నేనూ చైన్నెలో పెళ్లి చేసుకుంటానా అనేది తెలియదు. 

చైన్నెలోని దోస అంటే చాలా ఇష్టం. నేను విమానాల్లో ఎక్కువగా పయనిస్తుంటాను.అయితే విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో భయంగా ఉంటుంది. విమానం పై నుంచి కిందకి దిగిన తరువాత పైలెట్‌, ఇతర యూనిట్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ధన్యవాదాలు చెప్పాలి అని మా అమ్మ చెబుతూనే ఉంటారు. దాన్ని నేను ఇప్పటికీ పాటిస్తున్నానని శ్రీలీల పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement