థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలంటే పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు, దానికి టైమ్ పడుతుందని నిర్మాతలు.. అలా టాలీవుడ్‌లో మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నేడు.. ఎగ్జిబిటర్స్, నిర్మాతలతో చర్చలు జరగనున్నాయి. ఛాంబర్ అధ్యకుడు, నిర్మాత సురేశ్ బాబు ఆధ్వర్యంలో ఇరుపక్షాల సమస్యలని చర్చించబోతున్నారు.
(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో పర్సంటేజీ వివాదం.. పెద్ది మూవీకే ప్లస్ కానుందా?)
ఈ భేటీలో ప్రధానంగా పర్సంటేజీ, రెంటల్, ఓటీటీ విండో గురించి చర్చలు జరగనున్నాయి. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, ఏపీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, గిల్డ్ నిర్మాతల నుంచి ముగ్గురు సభ్యులు హాజరు కానున్నారు. మొత్తంగా 10 మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈరో జు జరిగే చర్చలలో ఎగ్జిబిటర్స్, నిర్మాతల మధ్య వివాదానికి పరిష్కారం దొరుకుతుంది నిర్మాత సీ కళ్యాణ్ చెబుతున్నారు. ఇరువర్గాలు వ్యక్తిగత విమర్శలు దాకా వెళ్లడంతో పరిస్థితి చేయి దాటకుండా ఫిలిం ఛాంబర్ చర్చలకు సిద్ధమైంది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా)


