ప్రస్తుతం టాలీవుడ్‌లో బిగ్ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. సరిగ్గా ఈ సమయంలోనే టాలీవుడ్‌లో సమస్య మొదలైంది. సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబిటర్స్ తమకు పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పెద్ది రిలీజ్‌కు ముందే టాలీవుడ్‌లో వివాదం ముదురుతోంది. అది కాస్తా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌కు మధ్య వార్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారంది. పెద్ది సమయంలో ఇలాంటి వివాదం తలెత్తడంతో నిర్మాతలు రవిశంకర్, నాగవంశీ ఫైరయ్యారు.
ఇక వివాదం పక్కనపెడితే.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పెద్ది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ రిలీజ్‌పై ప్రభావం పడనుందా? అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో ‘పెద్ది’ సినిమాకు స్క్రీన్ సమస్యలు రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు రెంటల్ సిస్టమ్‌కు వ్యతిరేకంగా పెద్దికి థియేటర్లు ఇవ్వొద్దనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
మరోవైపు ఈ వివాదం కూడా టాలీవుడ్‌కు ప్లస్ అవుతుందా? అని కొందరు భావిస్తున్నారు. టాలీవుడ్ ఫ్యూచర్‌కే టర్నింగ్ పాయింట్ అవుతుందా? అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మేకర్స్ అదే ఛాలెంజ్‌ను అవకాశంగా మార్చుకుంటే? పీవీఆర్ ఐనాక్స్, ప్రసాద్స్, అల్లు సినిమాస్ వంటి ఇండిపెండెంట్ థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేసి.. పరిమిత స్క్రీన్లతోనే భారీ కలెక్షన్లు కొడితే మాత్రం ఇండస్ట్రీ డైనమిక్స్ పూర్తిగా మారిపోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే.. స్టార్ హీరోల సినిమాలు తక్కువ స్క్రీన్లతో సక్సెస్ అయితే.. భవిష్యత్తులో పెద్ద నిర్మాతలు సింగిల్ స్క్రీన్ నెట్‌వర్క్‌పై ఆధారపడే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థ వద్ద ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ లాంటి భారీ ప్రాజెక్టులు కూడా లైనప్‌లో ఉన్నాయి. ఈ వివాదం ఇలాగే కొనసాగితే.. చివరికి ఎక్కువ నష్టం ఎవరికి? నిర్మాతలకా? ఎగ్జిబిటర్లకా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


