సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా | Naga Shaurya Bad Boy Karthik Movie Released In OTT, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Bad Boy Karthik OTT: చాన్నాళ్లకు శౌర్య చేసిన మూవీ.. ఓటీటీలో సడన్ స్ట్రీమింగ్

May 15 2026 8:21 AM | Updated on May 15 2026 10:32 AM

Bad Boy Karthik Movie OTT Streaming Now

తెలుగులో చాలామంది హీరోలున్నారు. అందులో నాగశౌర్య. సహాయ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరోగా పలు సినిమాలు చేసిన ఇతడు.. 'ఛలో' లాంటి మూవీస్ చేశాడు. అయితే గత కొన్నేళ్లుగా ఇతడికి సరైన హిట్ అనేది లేకుండా పోయింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఓ సినిమా చేశారు. అదిప్పుడు ఎలాంటి చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా)

ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జో అచ్యుతానంద, ఛలో, ఓ బేబీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న నాగశౌర్య.. 2023లో 'రంగబలి' చేశాడు. దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు గానీ ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో అప్పటి నుంచి మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఈ మూడేళ్లలో 'బ్యాడ్ బాయ్ కార్తీక్' చిత్రం చేయగా గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆటకే తేలిపోయింది. అసలు ఇదొచ్చిన సంగతి కూడా ఎవరికీ తెలియనంతగా మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.

'బ్యాడ్ బాయ్ కార్తీక్' విషయానికొస్తే.. కార్తీక్(నాగశౌర్య) వైజాగ్‌లో ఉంటాడు. అక్క కస్తూరి(శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. ఆమె ఓ లాయర్. రాయలసీమలోని కదిరిలో భూకబ్జాలు చేసే గోవిందప్పు(మైమ్ గోపీ), వరదారెడ్డి (సముద్రఖని)లపై న్యాయపోరాటం చేస్తుంటుంది. దీంతో ఈమెపై దాడి జరుగుతుంది. ఆ విషయం తెలిసి వైజాగ్ నుంచి రాయలసీమకు కార్తీక్ వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకునే అక్క.. అతడిపైనే ఎందుకు కోప్పడింది? ఒకప్పుడు సఖ్యతగా ఉన్న గోవిందప్ప, వరదారెడ్డి మధ్య ఎందుకు వైరం ఏర్పడింది? గోవిందప్పను చంపింది ఎవరు? వరదారెడ్డిని చంపింది ఎవరు? మధ్యలో హీరో ప్రేమకథ ఏంటనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement