Bad Boy Karthik Movie
-
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’లో కొత్త నాగశౌర్యని చూస్తారు
‘‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మూవీకి నాగశౌర్య మా ఫస్ట్ చాయిస్. ఆయన కథ వినగానే ఓకే అన్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో తన నటనతో శౌర్యగారు అందర్నీ సర్ప్రైజ్ చేస్తారు. తొలి 15 నిమిషాల నుంచి చివరి వరకు ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి తెలిపారు. నాగశౌర్య, విధి జోడీగా రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు చింతలపూడి విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఆది సాయికుమార్ నటించిన ‘శశి’ సినిమాకు ఒక భాగస్వామిగా చేశాను. సోలో నిర్మాతగా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నా తొలి సినిమా. నాగశౌర్యని ఇప్పటివరకు లవర్ బాయ్‌గా చూశారు. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’లో మాత్రం పూర్తి యాక్షన్‌తో చూస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ మరో స్థాయిలో ఉంటుంది. కదిరి నరసింహస్వామి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. రసూల్‌గారి విజువల్స్, హ్యారిస్ జయరాజ్‌గారి సంగీతం మా మూవీకి ప్లస్. దాదాపు 400లకు పైగా స్క్రీన్లలో మా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. తెలుగుతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశాలో కూడా రిలీజ్ చేస్తున్నాం. మా బ్యానర్లో జూన్‌లో ఒక సినిమా స్టార్ట్ కాబోతోంది. అలాగే ఇంకో సినిమా ప్రకటన కూడా ఉంటుంది’’ అని చెప్పారు. -
నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
నాగ శౌర్య యాక్షన్ మూవీ.. ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ బ్యాడ్‌బాయ్ కార్తీక్. ఈ చిత్రంలో విధి యాదవ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాగ శౌర్య ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించనున్నారు. ట్రైలర్లో ఫైట్ సీన్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సాయికుమార్, నరేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతమందించారు. -
ఎట్టకేలకు కొత్త సినిమా రిలీజ్ డేట్.. ఈ హీరో గుర్తున్నాడా?
తెలుగులోని ప్రామిసింగ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు. ఊహలు గుసగుసలాడే, ఛలో లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న ఇతడు.. తర్వాత మూవీస్ అయితే చేశాడు గానీ ఎనిమిదేళ్లుగా హిట్ అనేది అందుకోలేకపోయాడు. చివరగా 2023లో' రంగబలి' చిత్రంతో వస్తే ఘోరమైన డిజాస్టర్ అయింది. తర్వాత నుంచి ఎక్కుడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనంతగా మాయమైపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ హీరో నుంచి కొత్త సినిమా రాబోతుంది. ఈ మేరకు విడుదల తేదీ ప్రకటించారు.(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్‌గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బ్యాడ్ బాయ్ కార్తిక్'. విధి యాదవ్ హీరోయిన్. రామ్ దేశిన దర్శకుడు. గతేడాది ఇదే టైంకి షూటింగ్ పూర్తయినప్పటికీ ఎందుకనో రిలీజ్ చేయకుండా నాన్చుతూ వచ్చారు. మధ్యలో ఒకటి రెండు పాటలు వదిలినప్పటికీ అవేం ఇంప్రెస్ చేయలేదు. ఇప్పుడు సడన్‌గా శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెబుతూ ఏప్రిల్ 17న తమ చిత్రం థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు.హరీశ్ జయరాజ్ సంగీతమందించిన ఈ సినిమాలో సాయికుమార్, సముద్రఖని లాంటి సీనియర్స్ నటించారు. ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇదేదో రొటీన్ కమర్షియల్ మూవీలానే అనిపిస్తుంది. ఇలాంటి వాటికి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కట్లేదు. మరి మూడేళ్ల తర్వాత వస్తున్న నాగశౌర్య.. ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి? హిట్, ఫ్లాప్ సంగతి పక్కనబెడితే రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నప్పటికే హీరోలకు సరైన మార్కెట్ ఉండట్లేదు. అలాంటి మూడేళ్లుగా కనిపించని నాగశౌర్య ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: పదిరోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా) -
పొమ్మంటే...
తోడబుట్టినవాళ్ల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటే... ఆ అపార్థాలే వారు దూరమయ్యేలా చేస్తే... ఆ ఇద్దరి బాధ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. రచయిత చంద్రబోస్ ఊహించి ‘పొమ్మంటే...’ అంటూ భావోద్వేగంగా ఓ పాట రాశారు. నాగశౌర్య, శ్రీదేవి విజయ్‌కుమార్ సోదర, సోదరీమణిగా నటిస్తున్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. ఈ సినిమాలోని ‘పొమ్మంటే...’ పాటను గురువారం విడుదల చేశారు.ఈ ఇద్దరూ మనస్పర్థలతో విడిపోయే నేపథ్యంలో వచ్చే పాట ఇది. రామ్ దేశినా (రమేశ్) దర్శకత్వంలో శ్రీనివాస రావు చింతలపూడి నిర్మిస్తున్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’కి హ్యారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. ఆయన స్వరపరచిన ‘పొమ్మంటే...’ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా విజయ్ యేసుదాస్, శక్తిశ్రీ గోపాలన్ పాడారు. ‘‘హృదయాలను హత్తుకునేలా ఉండే ఈ పాట చాలాకాలం నిలిచిపోతుంది’’ అని నిర్మాత పేర్కొన్నారు. విధి, సముద్రఖని, నరేశ్ వీకే, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్. -
అందమైన ఫిగరు నువ్వా...
నాగశౌర్య, విధి జోడీగా నటించిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేశ్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమా నిర్మించారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘అందమైన ఫిగరు నువ్వా...’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటని శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్పాడారు. ‘‘కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాగశౌర్య. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైనపాటలు సూపర్ హిట్ అయ్యాయి. టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా రిలీజైన ‘అందమైన ఫిగరు నువ్వా...’పాటలో నాగశౌర్య, విధి మధ్య కెమిస్ట్రీ అదిరి΄ోతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
చాన్నాళ్లకు నాగశౌర్య నుంచి సినిమా.. టీజర్ రిలీజ్
ఊహలు గుసగుసలాడే, ఛలో లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన నాగశౌర్య.. తర్వాత సినిమాలు చేస్తున్నాడు గానీ సక్సెస్ అయితే అందుకోలేకపోతున్నాడు. 2023లో చివరగా 'రంగబలి' మూవీతో వచ్చాడు. తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్. అయితే రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ వాటి గురించి పెద్దగా అప్డేట్స్ ఇవ్వలేదు. ఇన్నాళ్లకు 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే చిత్రాన్ని సిద్ధం చేశాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు)రామ్ దేశినా (రమేశ్) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విధి హీరోయిన్. యూత్‌ఫుల్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీని తీసినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. పూర్ణ సీరియస్ లుక్‌లో కనిపించగా, సాయి కుమార్ పోలీస్ పాత్ర పోషించారు. త్వరలో మూవీ థియేటర్లలోకి రానుందని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే?)


