ఎట్టకేలకు కొత్త సినిమా రిలీజ్ డేట్.. ఈ హీరో గుర్తున్నాడా? | Naga Shaurya Bad Boy Karthik Movie Release Date | Sakshi
Sakshi News home page

Naga Shaurya: ఎనిమిదేళ్లుగా హిట్ లేదు.. మూడేళ్లుగా మూవీ చేయలేదు

Mar 27 2026 12:46 PM | Updated on Mar 27 2026 12:51 PM

Naga Shaurya Bad Boy Karthik Movie Release Date

తెలుగులోని ప్రామిసింగ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు. ఊహలు గుసగుసలాడే, ఛలో లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న ఇతడు.. తర్వాత మూవీస్ అయితే చేశాడు గానీ ఎనిమిదేళ్లుగా హిట్ అనేది అందుకోలేకపోయాడు. చివరగా 2023లో' రంగబలి' చిత్రంతో వస్తే ఘోరమైన డిజాస్టర్ అయింది. తర్వాత నుంచి ఎక్కుడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనంతగా మాయమైపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ హీరో నుంచి కొత్త సినిమా రాబోతుంది. ఈ మేరకు విడుదల తేదీ ప్రకటించారు.

(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్‌గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)

నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బ్యాడ్ బాయ్ కార్తిక్'. విధి యాదవ్ హీరోయిన్. రామ్ దేశిన దర్శకుడు. గతేడాది ఇదే టైంకి షూటింగ్ పూర్తయినప్పటికీ ఎందుకనో రిలీజ్ చేయకుండా నాన్చుతూ వచ్చారు. మధ్యలో ఒకటి రెండు పాటలు వదిలినప్పటికీ అవేం ఇంప్రెస్ చేయలేదు. ఇప్పుడు సడన్‌గా శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెబుతూ ఏప్రిల్ 17న తమ చిత్రం థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు.

హరీశ్ జయరాజ్ సంగీతమందించిన ఈ సినిమాలో సాయికుమార్, సముద్రఖని లాంటి సీనియర్స్ నటించారు. ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇదేదో రొటీన్ కమర్షియల్ మూవీలానే అనిపిస్తుంది. ఇలాంటి వాటికి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కట్లేదు. మరి మూడేళ్ల తర్వాత వస్తున్న నాగశౌర్య.. ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి? హిట్, ఫ్లాప్ సంగతి పక్కనబెడితే రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నప్పటికే హీరోలకు సరైన మార్కెట్ ఉండ‍ట్లేదు. అలాంటి మూడేళ్లుగా కనిపించని నాగశౌర్య ఏం చేస్తాడో చూడాలి?

(ఇదీ చదవండి: పదిరోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement