హెబ్బా పటేల్, చైతన్య రావు నటించిన కొత్త సినిమా 'రేపు ఉదయం 10 గంటలకు'.. ఆసక్తికరమైన టైటిల్‌తో మార్చి 14న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓ పిట్ట కథ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు ఈ మూవీని తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామ్ వీరపనేని నిర్మించారు. ఇందులో అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు.

హెబ్బా పటేల్, చైతన్య రావు ఇదివరకు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో మెప్పించారు. ఈ క్రమంలో వారిద్దరూ మరోసారి 'రేపు ఉదయం 10 గంటలకు'(Repu Udayam 10 Gantalaku) అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించారు. థియేటర్స్‌లో పెద్దగా ఈ మూవీ మెప్పించలేదు. దీంతో కేవలం పదిరోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.


