అందమైన ఫిగరు నువ్వా... | Lyrical Video of Andhamaina Figaru Nuvvaa from Naga Shaurya Bad Boy Karthik Released | Sakshi
Sakshi News home page

అందమైన ఫిగరు నువ్వా...

Oct 28 2025 12:35 AM | Updated on Oct 28 2025 12:35 AM

Lyrical Video of Andhamaina Figaru Nuvvaa from Naga Shaurya Bad Boy Karthik Released

నాగశౌర్య, విధి జోడీగా నటించిన చిత్రం ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’. నూతన దర్శకుడు రామ్‌ దేసినా (రమేశ్‌) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్‌ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమా నిర్మించారు. హ్యారిస్‌ జైరాజ్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘అందమైన ఫిగరు నువ్వా...’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 

కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ పాటని శ్రీధర్‌ సేన, ప్రియా జెర్సన్‌పాడారు. ‘‘కంప్లీట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’. పవర్‌ఫుల్‌ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాగశౌర్య. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైనపాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా రిలీజైన ‘అందమైన ఫిగరు నువ్వా...’పాటలో నాగశౌర్య, విధి మధ్య కెమిస్ట్రీ అదిరి΄ోతుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement