
ఊహలు గుసగుసలాడే, ఛలో లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన నాగశౌర్య.. తర్వాత సినిమాలు చేస్తున్నాడు గానీ సక్సెస్ అయితే అందుకోలేకపోతున్నాడు. 2023లో చివరగా 'రంగబలి' మూవీతో వచ్చాడు. తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్. అయితే రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ వాటి గురించి పెద్దగా అప్‌డేట్స్ ఇవ్వలేదు. ఇన్నాళ్లకు 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే చిత్రాన్ని సిద్ధం చేశాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు)
రామ్ దేశినా (రమేశ్) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విధి హీరోయిన్. యూత్‌ఫుల్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తీసినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. పూర్ణ సీరియస్ లుక్‌లో కనిపించగా, సాయి కుమార్ పోలీస్ పాత్ర పోషించారు. త్వరలో మూవీ థియేటర్లలోకి రానుందని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే?)