నాగ శౌర్య యాక్షన్‌ మూవీ.. ట్రైలర్‌ చూశారా? | Naga Shaurya and Vidhi Yadav Bad Boy Karthik Trailer out now | Sakshi
Sakshi News home page

Bad Boy Karthik Trailer: బ్యాడ్‌బాయ్‌ కార్తీక్‌గా నాగ శౌర్య .. ట్రైలర్‌ రిలీజ్

Apr 6 2026 5:49 PM | Updated on Apr 6 2026 5:52 PM

Naga Shaurya and Vidhi Yadav Bad Boy Karthik Trailer out now

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ బ్యాడ్‌బాయ్ కార్తీక్. ఈ చిత్రంలో విధి యాదవ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే పొలిటికల్ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాగ శౌర్య ఫుల్ యాక్షన్‌ మోడ్‌లో కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఫైట్ సీన్స్‌ చూస్తుంటే ఫుల్ యాక్షన్‌ మూవీగానే రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సాయికుమార్‌, నరేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.  ఈ సినిమా ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతమందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement