ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా | Therachaapa Movie OTT Streaming Update | Sakshi
Sakshi News home page

OTT: నెలలోపే ఓటీటీలో తెలుగు మూవీ స్ట్రీమింగ్

May 13 2026 4:48 PM | Updated on May 13 2026 4:51 PM

Therachaapa Movie OTT Streaming Update

ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ధురంధర్ 2, మిస్టర్ ఎక్స్, తిమ్మరాజుపల్లి టీవీ, కాళిదాస్ 2, కర్తవ్య తదితర చిత్రాలతో పాటు ఎగ్జామ్ అనే డబ్బింగ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడీ ఈ లిస్టులోకి ఓ తెలుగు సినిమా కూడా చేరింది. ఇంతకీ అదేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'తెరచాప'. గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ మూవీ శుక్రవారం (మే 15) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.

'తెరచాప' విషయానికొస్తే.. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న కాశీబాబు (నాగ మహేష్) ఓ ప్రమాదంలో చనిపోతాడు. ఇతడి మరణానికి ఆయన కొడుకు ఈశ్వర్ (నవీన్ రాజ్ శంకరపు) నిర్లక్ష్యమే కారణమని ఊరు మొత్తం వేలెత్తి చూపుతుంది. తన తండ్రిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే ఈశ్వర్, ఆ నింద భరించలేకపోతాడు. తన తండ్రి మరణం వెనుక ఏదో పెద్ద వ్యవహారమే ఉందని అనుమానించి అసలు నిజం తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి సీత (శ్రీలు), గాయత్రి (పూజా సుహాసిని) ఎలా సహాయపడ్డారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)

Advertisement
 
Advertisement
Advertisement