ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా | Kaalidas 2 Movie OTT Streaming Now Telugu | Sakshi
Sakshi News home page

OTT: తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చిన తమిళ థ్రిల్లర్ మూవీ

May 13 2026 11:47 AM | Updated on May 13 2026 11:55 AM

Kaalidas 2 Movie OTT Streaming Now Telugu

ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మిగతా భాషల్లోనూ మూవీస్ కూడా తెలుగు డబ్బింగ్ రూపంలో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఒకటి సైలెంట్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దాని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

'ప్రేమిస్తే' సినిమాతో గతంలో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న భరత్.. తర్వాత కాలంలో ఎక్కువగా తమిళంలోనే మూవీస్ చేస్తున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కాళిదాస్ 2'. గత నెల 3వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడుది అమెజాన్ ప్రైమ్, లయగ్స్ గేట్ ప్లే, టెంట్ కొట్ట, ఆహ తమిళ, సన్ నెక్స్ట్, షార్ట్ ఫ్లిక్స్ ఇండియా ఓటీటీల్లో ఒకేసారి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.

లయన్స్ గేట్ ప్లేలో తెలుగు వెర్షన్స్ ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుండగా.. అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం అద్దె విధానంలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే 2019లో వచ్చిన 'కాళిదాస్' చిత్రానికి ఇది సీక్వెల్. తొలి భాగం చూడకపోయినా సరే దీన్ని చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే చేశారు.

'కాళిదాస్ 2' విషయానికొస్తే.. ఓ గేటెడ్ కమ్యూనిటీలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అదే రోజు రాత్రి అక్కడే ఉన్న మిత్ర అనే నాలుగేళ్ల అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఈ కేసుని కాళిదాసు దర్యాప్తు చేస్తుంటాడు. ఓసారి గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ల గురించి ఓ డార్క్ సీక్రెట్ కాళిదాస్‌కి తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)

Advertisement
 
Advertisement
Advertisement