ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే థియేటర్లలో రిలీజైన సినిమాలు ఒకటి రెండు నెలల్లోనే స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. అలాంటి జేమ్స్ కామెరూన్ తీసిన 'అవతార్' మూడో భాగం మాత్రం ఆరు నెలల తర్వాత అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
'టైటానిక్' లాంటి మూవీ తీసిన జేమ్స్ కామెరూన్.. లాంగ్ గ్యాప్ తీసుకుని 2009లో 'అవతార్' అనే సినిమా తీశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. రూ.14-15 వేల కోట్ల వసూళ్లు రాగా.. 2022లో రిలీజైన పార్ట్ 2 కూడా రూ.18 వేల పైచిలుకు కలెక్షన్స్ సాధించింది. గతేడాది డిసెంబరులో మూడో పార్ట్ (అవతార్: ఫైర్ అండ్ యష్) రిలీజ్ కాగా దీనికి ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే వచ్చింది.
మూడో పార్ట్ కూడా వేలకోట్లు కలెక్షన్స్ సాధించినప్పటికీ ఓటీటీలోకి మాత్రం త్వరగా తీసుకురాలేదు. మార్చి 31న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇంగ్లీష్ వెర్షన్ వచ్చినప్పటికీ అద్దె విధానంలోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు జూన్ 24 నుంచి హాట్‌స్టార్‌లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
'అవతార్: ఫైర్ అండ్ యాష్' విషయానికొస్తే.. రెండో పార్ట్ 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) జంట తమ పెద్ద కొడుకు కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్‌పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కల్నల్‌కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)


