Therachaapa Movie
-
ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ధురంధర్ 2, మిస్టర్ ఎక్స్, తిమ్మరాజుపల్లి టీవీ, కాళిదాస్ 2, కర్తవ్య తదితర చిత్రాలతో పాటు ఎగ్జామ్ అనే డబ్బింగ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడీ ఈ లిస్టులోకి ఓ తెలుగు సినిమా కూడా చేరింది. ఇంతకీ అదేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'తెరచాప'. గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ మూవీ శుక్రవారం (మే 15) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.'తెరచాప' విషయానికొస్తే.. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న కాశీబాబు (నాగ మహేష్) ఓ ప్రమాదంలో చనిపోతాడు. ఇతడి మరణానికి ఆయన కొడుకు ఈశ్వర్ (నవీన్ రాజ్ శంకరపు) నిర్లక్ష్యమే కారణమని ఊరు మొత్తం వేలెత్తి చూపుతుంది. తన తండ్రిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే ఈశ్వర్, ఆ నింద భరించలేకపోతాడు. తన తండ్రి మరణం వెనుక ఏదో పెద్ద వ్యవహారమే ఉందని అనుమానించి అసలు నిజం తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి సీత (శ్రీలు), గాయత్రి (పూజా సుహాసిని) ఎలా సహాయపడ్డారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
సముద్రం నేపథ్యంలో...
నవీన్ రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో కైలాష్ దుర్గం నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో జోయల్ జార్జ్ మాట్లాడుతూ– ‘‘సముద్రం నేపథ్యంలో సాగే మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని కోరారు.‘‘కథ నచ్చి ఈ సినిమా చేశాను’’ అన్నారు కైలాష్ దుర్గం. ‘‘మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని ఈ సినిమాని రూపొందించాం’’ అని నవీన్ రాజ్ చెప్పారు. ‘‘మండుటెండలో సముద్ర తీరాన ఇసుకలో చెప్పులు లేకుండా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు’’ అని రాజీవ్ కనకాల చెప్పారు. -
‘తెరచాప’: మండుటెండలో చెప్పుల్లేకుండా షూటింగ్, చాలా కష్టపడ్డారు
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించిన తాజా చిత్రం ‘తెరచాప’. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మిస్తున్న ఈ చిత్రానికి జోయల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, జబర్దస్త్ అశోక్, నాగి కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీ కనకాల మాట్లాడుతూ..ఈ సినిమాలో నాతోపాటు ఎందరో సీనియర్ నటులు నటించారు. అలాగే కొత్త వారు కూడా నటించారు. మండుటెండలో సముద్ర తీరాన ఇసుకలో చెప్పులు లేకుండా నటించడం అనేది ఎంతో కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులలో కూడా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు. శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా కూడా ఆయన వాటిని ఎదిరించి నిలబడ్డారు. అంత కష్టపడి నటించినా ఈ సినిమాను తన తండ్రికి అంకితం చేస్తున్నాను అని నాతో అన్నప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను.ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు సముద్ర మాట్లాడుతూ... "సముద్రతీతంగా అటువంటి పరిస్థితులలో ఒక సినిమా తీయడం అనేది ఎంతో కష్టమైన విషయం. అటువంటి సినిమాను ఈ చిత్రం బృందం అంతా కలిసి ఎంతో పట్టుదలతో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందరూ వీరిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.‘సినిమా కోసం మేము సముద్ర తీరాన ఎన్నో రోజులు ఎంతో కష్టపడి అక్కడ బ్రతికే మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని వారిలో ఒకరిగా కలిసిపోయి చిత్రీకరించాం. ఎంతోమంది ఎన్నో కలలు కని సినిమా తీసినట్లే మేము కూడా చేశాం. మా సినిమాను ప్రేక్షకులు అంతా ఆదరించి మంచి విజయం సాధించేందుకు తోడ్పడుతారని కోరుకుంటున్నాను’ అని హీరో నవీన్‌రాజ్ శంకరాపు అన్నారు.


